వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన సీఎం జగన్

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. ఆయన క్షేమ సమాచారాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కరోనాతో తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న కరుణాకర్ రెడ్డిని పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని సీఎంకు వివరించారు. భూమన త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. భూమన గతవారం కరోనా బారినపడ్డారు.. ఆయనతో పాటూ కుమారుడికి పాజిటివ్ తేలింది. వెంటనే రుయాలో చేరి చికిత్సపొందుతున్నారు. ఇదిలా ఉంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2న ఇడుపుల పాయలో పర్యటించనున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు నిర్వహించగా.. అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ తేలింది. ఆయన వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన్ను కాంటాక్ట్ అయినవాళ్లకు టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/32HN9su

Comments