హైదరాబాద్‌: విలేకరి ముసుగులో వ్యభిచారం.. సిటీలో నాలుగు బ్రాంచ్‌లు

మీడియా ప్రతినిధి ముసుగులో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి బాగోతం బట్టబయలైంది. షేక్‌పేట దర్గాకు చెందిన యెన్నం రమేష్‌ (39) అనే వ్యక్తి ఓ టీవీ ఛానెల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు. బ్రోకర్లతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి అమ్మాయిలను అక్రమంగా నగరానికి తీసుకొస్తున్నాడు. వారితో నిజాంపేటలోని కేటీఆర్‌ కాలనీతో పాటు జగద్గిరిగుట్ట, ఆల్విన్‌కాలనీ, శుభోదయ కాలనీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. Also Read: తాను మీడియా ప్రతినిధినని చెప్పుకుంటూ ఎవరూ తన దారికి అడ్డం రాకుండా బెదిరింపులకు గురిచే్సతున్నాడు. ‘థర్డ్‌ ఐ’ పేరుతో ఓ వాట్సాపు గ్రూపును ఏర్పాటు చేసి అందులో అనేక మంది పోలీసు అధికారుల నంబర్లను సైతం పెట్టాడు. బాచుపల్లిలోని కేటీఆర్‌ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అక్కడ రైడ్ చేశారు. ఈ సందర్భంగా రమేష్‌తో పాటు ఓ సెక్స్‌వర్కర్, ఇద్దరు విటులను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. రమేష్ ఇతర చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2QBnso3

Comments