ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడు పనిచేయవంటే?

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీకు బ్యాంకులో ఏమైనా పని ఉందా? అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి. నగ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. సామాన్యుల దగ్గరి నుంచి బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి చాలా మందికి బ్యాంకుల్లో పని ఉంటుంది. చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, డిపాజిట్ చేయడం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ నెల (సెప్టెంబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 12, 26 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే సెప్టెంబర్ నెల‌లో వ‌చ్చే 4 ఆదివారాలు 6, 13, 20, 27 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. Also Read: రెండో శనివారాలు, ఆదివారాల్లో సెలవులు కాకుండా సెప్టెంబర్ నెలలో బ్యాంక్ ఉద్యోగులకు అదనంగా కూడా సెలవు ఉంది. సెప్టెంబర్ 18న బతుకమ్మ తొలి రోజు సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఈ ఒక్క రోజు మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఏపీలో పనిచేసే బ్యాంక్ ఉద్యోగులకు ఈ సెలవు లేదు. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3hOmsc5

Comments