జీహెచ్ఎంసీ రెవెన్యూ మేళా ప్రారంభిస్తోంది. ఆస్తిపన్ను బాకీ ఉన్న వారి కోసం అద్భుత అవకాశాన్ని కలిస్తూ అధికారులు మేళా ఏర్పాటు చేశారు. బాకీ ఉన్న ఆస్తిపన్ను వడ్డీని 90 శాతం మేర తగ్గిస్తూ జీహెచ్‌ఎంసీ వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకు రెవెన్యూ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఈ మేళాల్లో వెంటనే పరిష్కరిస్తామని సర్కిల్ 17, 18 ఉప కమిషనర్లు గీతారాధిక, సేవా ఇస్లావత్ తెలిపారు. Read More: ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు, ట్యాక్స్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్నం తరువాత ఈ మేళా పనిచేస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 6, 13వ తేదీల్లో మేళాలు పనిచేస్తాయని, సెప్టెంబర్ 9 నుంచి 12వ తేదీల్లో భోజన విరామం అనంతరం మేళా ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని భాగ్యనగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు తెలిపారు. బాకీ ఉన్న ఆస్తి పన్ను త్వరగా చెల్లించాలని కోరారు. రాష్ట్రంలోని నగర పాలక, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయడంతో వేలాది మందికి ప్రయోజనం చేకూరింది. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్నును ఈ ఏడాది మార్చి లోపు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇవ్వడం కూడా ఉపయోగకరంగా మారింది. దీంతో బకాయిలు చెల్లించే వారి నుంచి మంచి స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను బకాయిలు వంద శాతం వసూలుకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసి వసూలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు పన్నుల వసూళ్లకు రెవెన్యూ మేళాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3baGECz
Comments
Post a Comment