‘నీకో దండం మహా ప్రభో.. కథ నువ్ అనుకున్నది.. ఊహించుకుంటున్నది కాదు.. అసలు ఆ బ్యాక్ డ్రాప్ కానేకాదు.. తండ్రీ కొడుకులు ఉండరు.. దేవాదాయశాఖకి నిధులకు సంబంధించినది కానే కాదు.. ఈ కథ నేను చిరంజీవి గారితో రెండేళ్ల నుంచి ట్రావెల్ అవుతూ రాసిన కథ.. దేవుడి దయవల్ల ఈ కథలో చిరంజీవి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి సరిపోయింది కాని.. నీ పిచ్చి మాటలు చూస్తే ఎవరికైనా అనుమానం వచ్చేది.. కావాలంటే రాసిఇస్తా.. ప్రపంచం ముందు చెప్తున్నా’ అంటూ దర్శకుడు ‘ఆచార్య’ కాపీ ఇష్యూపై సీరియస్‌గా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ మూవీ ‘ఆచార్య’ కథ నాదే అంటూ సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చాడు అప్ కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి. 18 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేశానని చెప్తున్న రాజేష్.. రీసెంట్‌గా బి.గోపాల్-గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేశారట. అంతకు ముందు దాదాపు తొమ్మిది మంది దర్శకుల దగ్గర పనిచేశారట. ఇక డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు 2017లో పెద్దాయన అనే కథను రాసుకుని నందమూరి బాలయ్యతో తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ కథను రిజిస్టర్ కూడా చేయించుకున్నాడట. అయితే ఇటీవల తన మిత్రుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ వారికి కథను నెరేట్ చేయగా.. వాళ్లు విని కథను రికార్డ్ చేసుకుని కొత్త దర్శకుడితో ఇంత భారీ సినిమాను చేయలేం అని చిన్న కథ ఏదైనా ఉంటే చెప్పమని కోరారని.. అయితే ఇలాంటి హేవీ కథకు కొరటాల శివ అయితే బాగుంటుందని డైరెక్షన్ మీరు కాకుండా ఆయనతో చేయడానికైతే మీ కథను తీసుకుంటామని కోరారని తెలిపాడు ఈ దర్శకుడు. అయితే ఈ కథను ఇవ్వనని అక్కడ నుంచి వచ్చేశానని.. ఆ తరువాత నా ప్రయత్నాల్లో నేను ఉండి.. చెన్నై గెలాక్సీ హాస్పటల్ కుమార్ గారికి నా కథను చెప్పా. తమిళంలో ఆయన రెండు సినిమాలు చేశారు. సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయిపోయిందని బాలయ్యను మరో మూడు నెలల తరువాత చేద్దాం అని చెప్పడంతో డైలాగ్ వెర్షన్ రాసుకుంటుండగా.. 2019 అక్టోబర్ 4న సాయంత్రం చిరంజీవి-కొరటాల కాంబినేషన్‌లో ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారని అది చూసి షాకై తాను మోసపోయిన విషయాన్ని రైటర్స్, డైరెక్టర్ అసోషియన్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు రాజేష్. ఈ సందర్భంగా తనను మోసం చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికూమర్ పైన మైత్రీ మూవీస్ పైన కొరటాల పైన తీవ్ర ఆరోపణలు చేశారు రాజేష్. రవికుమార్ బినామీ సంస్థే మైత్రీ అని వారి ద్వారానే కథ కొరటాలకు వెళ్లిందని.. ఈ ముగ్గురు స్నేహితులు కావడంతో ‘ఆచార్య’ కథ నా దగ్గర నుంచి కొట్టేశారంటూ ఆరోపించారు. అయితే ‘ఆచార్య’ కాపీ ఇష్యూపై రాజేష్ మీడియాకెక్కడంతో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఓ టీవీ చర్చలో రాజేష్‌తో మాట్లాడిన ఆయన.. ఈ కథ రాజేష్ చెప్పింది కాదని తెలిపారు. ‘ఆచార్య కథ ఇప్పటికే రిజిష్టర్ అయ్యిందని.. కథను మార్చే ఛాన్స్ లేదని రాజేష్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నాడని.. ఈ ఇష్యూని చిరంజీవి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని.. ఇంతవరకూ వచ్చింది కాబట్టి కోర్టుకి వెళ్లి లీగల్‌గా యాక్షన్ తీసుకుంటా అంటూ ఆవేశంగా మాట్లాడిన కొరటాల.. యువ దర్శకుడు రాజేష్‌ని బ్లేమ్ చేయొద్దని హెచ్చరించారు. అయితే రాజేష్ మాత్రం.. భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా ఆచార్య కథ నాదే.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. కొరటాల కో డైరెక్టరే నాకు ఈ విషయం చెప్పారు.. ఫస్ట్ లుక్ బ్యాక్ డ్రాప్ కూడా నేను రాసిన కథలోదే అంటూ వాదించారు. ఈ విషయంలో కొరటాల కోర్టుకి వెళ్లినా.. జైలులో పెట్టించినా వెనకడుగు వేయనని.. అవసరమైతే జైలుకి వెళ్లి అక్కడ కూర్చుని కొత్త కథ రాసుకుంటానని ప్రాణాలైనా వదిలేస్తానంటూ రాజేష్ గట్టిగా చెప్తున్నారు. అయితే నేను తీసే ఆచార్య కథ నువ్ అనుకున్నదే అని ఎలా అనుకుంటావ్.. ఆ కథ ఇది కాదని నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా అంటూ కొరటాల ఎంత చెప్పినా రాజేష్ మాత్రం పాత పాటే పాడుతూ కొరటాలను మరింత ఇరిటేట్ చేయడంతో ఈ ఇష్యూ చిరంజీవి దగ్గరే తేల్చుకుంటామని.. కోర్టుకి వెళ్తున్నట్టు తెలిపారు కొరటాల.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/32ys97K
Comments
Post a Comment