జిల్లాను కరోనా వణికిస్తోంది.. ముఖ్యంగా శ్రీకాకుళంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు. కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నారు. శ్రీకాకుళంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మంగళవారం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎవరు అనవసరంగా బయట తిరగకూడదు. ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలుకు అనుమతి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మందుల దుకాణాలు మినహా ఏ ఇతర దుకాణాలు, చిల్లర దుకాణాలతో సహా, తెరవడానికి వీల్లేదు. శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశాన్ని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నిషేధించారు. ప్రజలు తమకు సహకరించాలని అధికారులు కోరారు. శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశించే ముఖ్యంగా ఆరు మార్గాలు.. తోటపాలెం జంక్షన్, బలగ ఏసిబి కార్యాలయం మార్గం, పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్, కిల్లిపాలెం జంక్షన్‌ను గుర్తించి, పనులు లేకుండా అనవసర రాకపోకలను నిరోధించడానికి చర్యలు తీసుకున్నారు. బయటకు వచ్చే వారు మాస్కు, ఫేస్ షీల్డు ధరించాలి. చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని, ప్రతి చోట ముఖ్యంగా దుకాణాలు, మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3jyg9tO
Comments
Post a Comment