వెస్టిండీస్ గడ్డపై ఆగస్టు 18 నుంచి ప్రారంభంకానున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఆడేందుకు ఒకే ఒక దక్షిణాఫ్రికా క్రికెటర్ అక్కడికి వెళ్లనున్నాడు. కరోనా వైరస్ కారణంగా దక్షిణాఫ్రికాలో ఇంకా ప్రయాణ ఆంక్షల్ని ఆ దేశ ప్రభుత్వం కొనసాగిస్తుండగా.. ఆగస్టు తొలి వారం నాటికి సఫారీ క్రికెటర్లు విండీస్ గడ్డపై చేరుకోవడం కష్టంగా మారింది. అయితే.. దక్షిణాఫ్రికా టీమ్‌కి ఆడుతున్న పాకిస్థాన్ సంతతి క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం తాను సీజన్‌లో ఆడబోతున్నట్లు ప్రకటించాడు. దానికి కారణం.. తాహిర్ ప్రస్తుతం పాక్‌లో ఉండటమే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడేందుకు ఈ ఏడాది ఆరంభంలో పాకిస్థాన్ గడ్డపైకి వెళ్లిన ఇమ్రాన్ తాహిర్.. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించడంతో అక్కడే ఉండిపోయాడు. దాంతో.. సీపీఎల్ కోసం ఆగస్టు 1 నాటికి తాను కరీబియన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నట్లు ఇమ్రాన్ తాహిర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంఛైజీకి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. దక్షిణాఫ్రికాకి చెందిన దుస్సేన్, షంషీ, నోర్తేజ్, రిలీ రొసౌ, కొలిన్ ఇంగ్రామ్ తదితరులు సీపీఎల్‌లో 2020 సీజన్‌లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీలో ఆడటంపై ఈ సఫారీ క్రికెటర్లు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. 2013 నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది టోర్నీని విండీస్ బోర్డు వాయిదా వేసేలా కనిపించింది. కానీ.. రెండు రోజుల క్రితం పూర్తి స్థాయి షెడ్యూల్‌ని ప్రకటించిన విండీస్ బోర్డు అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆగస్టు 18 నుంచి టోర్నీ ప్రారంభంకానుండగా.. మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది. సీపీఎల్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 19న జరుగుతుందని షెడ్యూల్‌లో స్పష్టం చేసిన విండీస్ బోర్డు.. లీగ్‌లో ఆడే విదేశీ క్రికెటర్లందరూ ఆగస్టు 1 నాటికి అక్కడికి చేరుకోవాలని సూచించింది. సీపీఎల్ 2020 సీజన్‌ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించబోతుండటంతో.. టోర్నీకి ముందు ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల్ని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/308VwO4
Comments
Post a Comment