ఏపీలో జర్నలిస్టులకు జగన్ సర్కార్ తీపి కబురు

జగన్ సర్కార్ జర్నలిస్టులకు తీపి కబురు చెప్పింది. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు, వైద్యానికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఆస్పత్రులు గుర్తించనున్నారు. వైద్యం అందించేందుకు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రిని గుర్తించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ఆస్పత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షలు నుంచి అడ్మిట్‌ చేసుకొని వైద్యం అందించే వరకు ప్రతి జిల్లాలో సమాచార శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కలిసి.. సహకారం అందించనున్నారు. పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారిగా సమాచార శాఖ జేడీ కిరణ్‌కుమార్‌ను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ శక్రువారం జర్నలిస్టు సంఘాలతో విజయవాడలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో సమాచార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులను నోడల్‌ అధికారులుగా నియమించి వారి ఫోన్‌ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/33hKEz8

Comments