వాహనదారులకు ఊరట కలిగే అంశం. దేశీ ఇంధన ధరలు ఈరోజు నిలకడగానే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో సోమవారం లీటరు రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. కూడా రూ.80.14 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.85.21 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.81.31 వద్ద నిలకడగానే ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.84.82 వద్ద నిలకడగా ఉంది. డీజిల్ ధర రూ.80.94 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.81.94 వద్ద నిలకడగానే ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం తగ్గుదలతో 43.75 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.02 శాతం పెరుగుదలతో 41.30 డాలర్లకు ఎగసింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2X0MKPU
Comments
Post a Comment