జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం కలకలంరేపింది. ఈ నెల 14న ఓ వ్యక్తికి కరోనా రావడంతో.. తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. కానీ అక్కడి ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు సరిగా లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బందిలో కలవరం మొదలైంది. తన భర్త 12 రోజుల నుంచి ఆచూకీ కోసం అతడి భార్య వెంకాయమ్మ ఆస్పత్రి చుట్టూ తిరుగుతోంది. ఆస్పత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా.. ఎంత మందిని అడిగినా సమాధానం చెప్పే వారు లేరని ఆవేదన వ్యక్తం చేసింది. జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేదని భార్య కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్త ఏమైపోయాడో చెప్పండని జీజీహెచ్ దగ్గర భార్య కన్నీరు మున్నీరవుతోంది. ఈ వ్యవహారంపై అధికారుల కూడా ఆరా తీస్తున్నారు. అయితే అతడికి పాజిటివ్ ఉండటంతో అందరిలో టెన్షన్ మొదలైంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2BHJzW6
Comments
Post a Comment