దేశీ ఇంధన ధరలు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. స్థిరంగా కొనసాగితే.. మాత్రం భారీగా దిగొచ్చింది. హైదరాబాద్లో మాత్రం ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.80.14 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.85.21 వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.81.31 వద్ద నిలకడగానే ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నా యి. పెట్రోల్ ధర రూ.84.82 వద్ద నిలకడగా ఉంది. డీజిల్ ధర రూ.80.94 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర మాత్రం భారీగా తగ్గింది. లీటరుకు రూ.8.38 తగ్గుదలతో రూ.73.56కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.87.19 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.05 శాతం పెరుగుదలతో 43.66 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.95 శాతం పెరుగుదలతో 40.28 డాలర్లకు ఎగసింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gaWnDg
Comments
Post a Comment