షాక్.. బంగారం ఆల్‌ టైమ్ రికార్డ్.. వెండి పైపైకి.. ఈరోజు రేట్లు ఇవే!

పసిడి ప్రేమికులకు ఝలక్. పరుగులు పెడుతూనే వస్తోంది. ఈరోజు కూడా భారీగానే పెరిగింది. మరింత పైపైకి చేరింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ పసిడి కొండెక్కి కూర్చుంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పైకి కదిలింది. దీంతో ధర రూ.55,310కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.50,740కు ఎగసింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 8వ రోజు కావడం గమనార్హం. Also Read: పసిడి ధర పెరిగితే.. కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.66,050కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.30 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1960 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 24.35 డాలర్లకు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పైకి కదిలింది. రూ.51,500కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.250 పెరుగుదలతో రూ.52,700కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.50 పెరుగుదలతో రూ.66,050కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gfji0f

Comments