ఏపీ బీజేపీ నేతలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన అధిష్టానం

నేతలకు అధిష్టానం దిమ్మ తిరిగే షాకిచ్చింది. మీడియా ఛానల్స్ చర్చల్లో పాల్గొనవద్దని చెప్పినా చర్చల్లో పాల్గొన్న పలువురికి నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి హోదా లేని విశాఖకి చెందిన శ్రీరాం మీడియా చర్చల్లో పాల్గొనటంపై ఏపీ బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. అలాగే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న మరో నేత లంకా దినకర్‌తో పాటూ మరికొంతమందికి బీజేపీ డిసిప్లినరి కమిటీ కో కన్వీనర్ సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేశారు. లంకా దినకర్ గత ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగి.. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాలకు సంబంధించి అంశాలపై మాట్లాడినందుకు ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్టు బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇదే కారణంతో మరికొందరు నేతలకూ నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కన్నా లక్ష్మీనారాయణను ఆ స్థానం నుంచి తప్పించి.. ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఉన్నట్టుండి కన్నాను మార్చి వీర్రాజుకు బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై లక్ష్మీనారాయణ స్పందించాల్సి ఉంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/39Aw8n7

Comments