చిత్తూరు బుడతడు యూకేలో పెద్ద సెలబ్రిటీ.. శభాష్ చిన్నోడా

చిత్తూరుకు చెందిన బుడతడు యూకేలో పెద్ద సెలబ్రిటీ అయ్యాడు. భారత్‌కు కొవిడ్ -19 రిలీఫ్ ఫండ్ ఇవ్వ‌డం కోసం ఐదేళ్ల తెలుగు బాలుడు రూ .3.7 లక్షలు సేకరించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మాంచెస్టర్‌లో నివాసం ఉండే జిల్లాకు చెందిన అనీశ్వర్‌ కుంచాలా అనే ఐదేళ్ల బుడతడు.. కొవిడ్ వంటి కష్టం సమయంలో సాయం చేయాలని భావించాడు. కానీ ఎలా చేయాలో అర్ధంకాని పరిస్థితి. అప్పుడే సర్‌ థామస్‌ మూర్‌ ఏళ్ల వృద్ధుడు అనీశ్వర్‌కు ఓ ఐడియా చెప్పాడు. యూకేలో కరోనాతో బాధపడేవారికి వైద్యం అందించడం కోసం 100 ఏళ్ల వయసులో థామస్‌ మూర్‌ ఓ సర్కిల్‌ చుట్టు 100 రౌండ్లు నడిచి విరాళాలు సేకరించాడు. అనీశ్వర్ కూడా అదే స్ఫూర్తితో మరో 60 మంది పిల్లలతో కలిసి ‘లిటిల్‌ పెడలర్స్‌ అనీశ్వర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌’పేరుతో మేలో ఓ టీమ్‌ను తయారు చేశాడు. వీరంతా కలిసి దాదాపు 3200 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించారు. ఇలా 3.7 లక్షలు సేకరించారు. ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటం చేస్తున్న భారత్‌కు అందించాడు. అంతేకాదు యూకేకు సాయం చేయడం కోసం క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభించాడు. ఈ చిన్నోడు యూకేలో ఓ సెలబ్రిటీ అయ్యాడు. మనోడి ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్‌ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ అనీశ్వర్‌‌ను అభినందించారు. బ్రిటీష్‌ రాజకీయ నాయకులు అనీశ్వర్‌ను కలిసి.. ప్రశంసిస్తున్నారు. వారింగ్టన్‌ సౌత్‌ ఎంపీ ఆండీ కార్టర్‌ అనీశ్వర్‌ ఆశయాన్ని మెచ్చుకున్నారు. మరో ఎంపీ షార్లెట్ మేనేజర్ ఆగస్టు 6న అనీశ్వర్‌ను కలవనున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2CNt3V9

Comments