అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు జోరు కొనసాగించారు. కరోనా వైరస్ కారణంగా ఐదు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కి టీమిండియా దూరంగా ఉండిపోగా.. వచ్చే ఏడాది జనవరి వరకూ భారత్ జట్టు మళ్లీ వన్డేలు ఆడే సూచనలు కనిపించడం లేదు. ఆస్ట్రేలియా గడ్డపై జనవరి 12 నుంచి 17 వరకూ కంగారూలతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. గత మార్చి నుంచి వన్డేలకి భారత క్రికెటర్లు దూరంగా ఉన్నా.. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్ని దక్కించుకున్నారు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 871 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. వైస్ కెప్టెన్/ఓపెనర్ రోహిత్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక పాక్‌కి చెందిన బాబర్ అజామ్ (829), న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (818), దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (790) పాయింట్లతో టాప్-5లో కొనసాగుతున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. భారత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 719 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (701), పాట్ కమిన్స్ (689), కగిసో రబాడ (665) టాప్-5లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ రవీంద్ర జడేజా 286 పాయింట్లతో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3102e8h
Comments
Post a Comment