బంగారం, వెండి కొనే వారికి భారీ షాక్.. ఒకేసారి రూ.3,400 పెరిగిన ధర!

ఇక బంగారం కొనడం సాధ్యం కాదేమో? కేవలం బాగా డబ్బున్నోళ్లు మాత్రమే బంగారం కొనే పరిస్థితులు వస్తాయా? ఏమో.. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే ఇది జరగవచ్చేమో అనిపిస్తోంది. ఎందుకనుకుంటున్నారా? భారీగా పెరుగుతూ వస్తోంది. సరికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. వెండి కూడా నేనేంతక్కువ కాదంటూ పరుగులు పెడుతోంది. అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ సంక్షోభం వంటి అంశాలు పసిడి పరుగుకు దోహదపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పైకి కదిలింది. దీంతో ధర రూ.54,300కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.730 పెరుగుదలతో రూ.49,780కు ఎగసింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం. Also Read: పసిడి ధర పెరిగితే.. కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3490 పైకి కదిలింది. దీంతో ధర రూ.64,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 2.34 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1938 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 7 శాతం పెరుగుదలతో 24.58 డాలర్లకు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.840 పైకి కదిలింది. రూ.50,800కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.840 పెరుగుదలతో రూ.52,000కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.3490 పెరుగుదలతో రూ.64,700కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3g9nJd8

Comments