టీవీ ప్రేక్షకులకు షాక్.. కొత్త రూల్స్‌తో 150 ఛానళ్లు బంద్?

టీవీ బ్రాడ్‌కాస్టర్స్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఆర్డర్‌తో వీరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త టారిఫ్ ఆర్డర్ ()ను తక్షణమే అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది. దీని వల్ల చాలా ఛానళ్లను నిలిపివేయాల్సి వస్తుందని బ్రాడ్‌కాస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింంగ్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ మే నెలలో ఐబీఎఫ్ సభ్యులతో సమావేశమయ్యారు. ఎన్‌టీవో 2.0 ఇప్పట్లో అమలులోకి రాదని అయన తెలిపారు. అయితే ఇప్పుడు ట్రాయ్ మాత్రం ఆర్డర్ జారీ చేసింది. దీంతో బ్రాడ్‌కాస్టర్లు షాక్‌కు గురయ్యారు. Also Read: ఎన్‌టీవో 2.0 వల్ల తమ ఛానల్ ప్రైసింగ్ సామర్థ్యం తగ్గిపోతుందని బ్రాడ్‌కాస్టర్లు పేర్కొంటున్నారు. ట్రాయ్ ప్రతి ఛానల్‌కు ధరను నిర్ణయించింది. ఇది గరిష్టంగా రూ.12 వరకు (ప్రస్తుతం రూ.19 వరకు ఉంది) ఉంది. అంతేకాకుండా ట్రాయ్ ఇంకా ఛానల్ ప్యాక్‌పై డిస్కౌంట్‌ను గరిష్టంగా 33 శాతానికి (ప్రస్తుతం 60-80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు) పరిమితం చేసింది. దీంతో నేరుగానే బ్రాడ్‌కాస్టర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది. Also Read: స్టార్ అండ్ డిస్నీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా మాట్లాడుతూ.. ఎన్‌టీవో 2.0 అమలు వల్ల భవిష్యత్‌లో 100 నుంచి 150 వరకు ఛానల్ బంద్ కావొచ్చని తెలిపారు. ఆర్థికంగా ప్రయోజనం లేని ఛానళ్లు కనుమరుగు అవుతాయని వివరించారు. ఇకపోతే ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జనవరి 1న నోటిఫై చేసింది. అయితే దీనిపై టాప్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్లు, ఇండియన్ బ్రాడ్‌కాస్టింంగ్ ఫౌండేషన్ (IBF), ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బాంబే హైకోర్టుకు వెళ్లాయి.అయితే కోర్టు మాత్రం బ్రాడ్‌కాస్టర్లకు ఎలాంటి ఊరట ఇవ్వలేదు. జూలై 24న ట్రాయ్.. రెఫరెన్స్ ఇంటర్‌కనెక్ట్ ఆఫర్‌ను మార్చాలని బ్రాడ్‌కాస్టర్లను కోరింది. ఆగస్ట్ 10 నాటికి ఎన్‌టీవో 2.0 నిబంధనలు అమలు చేయాలని డెడ్‌లైన్ విధించింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2D6EW8h

Comments