సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి చేసిన ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఐరోపాలో తమ దళాలను తగ్గించడం వెనుక భారతదేశానికి చైనా నుంచి బెదిరింపులు, ఆగ్నేయాసియాలో పరిస్థితులు ప్రధాన కారణాలలో ఒకటని గురువారం జరిగిన బ్రస్సెల్స్ ఫోరమ్‌లో పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో అమెరికా దళాలను తగ్గించాలనే నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నామని, ఎందుకంటే వాటిని ఇతర ప్రదేశాలకు తరలించాలని అన్నారు. జర్మనీ నుంచి తమ దళాలను వెనక్కు మళ్లిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన ఐరోపా దేశాల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ చర్యలతో భారతదేశానికి బెదిరింపులు ఉన్నాయని, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ చైనా సముద్రం వంటి దేశాలు ఉన్నాయని పాంపియో చెప్పారు. ‘మేము చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోబోతున్నాం.. ఇది ఓ సవాల్‌గా భావిస్తున్నాం.. దీనిని పరిష్కరించడానికి మాకు వనరులు ఉన్నాయని నిర్ధారించుకోబోతున్నాం’ అని ఆయన అన్నారు. పొరుగుదేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని పాంపియో ప్రధానంగా ప్రస్తావించడం అమెరికా విధాన ప్రకటన, భద్రత విధానాలను సూచిస్తుంది. గాల్వన్ లోయ ఘర్షణ, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కార్యకలాపాలు, దాని దోపిడీ ఆర్థిక విధానాల గురించి పాంపియో మాట్లాడారు. చైనా నుంచి ఎదురువుతున్న సవాళ్లపై అమెరికా, ఐరోపా సమాఖ్య చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. ట్రాన్స్-అట్లాంటిక్ కూటమికి చైనా నుంచి ఎదుర్కొంటున్న ముప్పుపై సాధారణ అవగాహన ఇది తోడ్పడుతుందన్నారు. చైనా చర్యలపై ఇరుపక్షాలకు ‘సమిష్టి వివరాలు’ అవసరమని పాంపియో స్పష్టం చేశారు. అందువల్ల ఇద్దరూ కలిసి చర్య తీసుకోవచ్చన్నారు. హువాయి చైనా నిఘా రాజ్యంలో భాగమేనా అని అడిగిన ప్రశ్నకు పాంపియో సమాధానం ఇస్తూ.. చైనా భద్రతా సిబ్బంది ఆ కంపెనీ ప్రధాన కార్యాలయం పై అంతస్తులో పనిచేశారని, చైనా చట్టం ప్రకారం హువాయి వ్యక్తిగత సహా ఏదైనా వివరాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి పంపించాలని కోరింది అన్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/31jyapW
Comments
Post a Comment