ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. ముఖ్యంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ వైరస్ వేగంగా విస్తరిస్తోంది.. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అయినా పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తోంది. ఇప్పటికే అనంతపురం, ఒంగోలు, చీరాల, కాకినాడ, ఏలూరు వంటిచోట్ల లాక్‌డౌన్ ప్రకటించిన పరిస్థితి. దీంతో మరికొన్ని ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా తిరుపతిలో లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరిగింది. సోమవారం నుంచి 15 రోజులపాటు నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో నగరపాలక సంస్థ స్పందించింది. నగరంలో ఎలాంటి లాక్ డౌన్ విధించడం లేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కార్పొరేషన్ కమీషర్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. కానీ కరోనా కేసులు పెరుగుతున్నాయని.. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భౌతిక దూరం పాటించడంతో పాటూ శానిటైజర్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/389HP3K
Comments
Post a Comment