వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పోస్ట్.. వృద్ధుడి అరెస్ట్

సోషల్ మీడియా పోస్ట్ ఓ వృద్ధుడిని చిక్కుల్లో పడేసింది. ప్రభుత్వం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పోస్ట్ ఫార్వార్డ్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రత్నంపేటలో నరసింహారావు నివాసం ఉంటున్నాడు. కుటుంబపరమైన సమస్యలతో భార్య, కుమారుడు మరోచోట నివాసముంటున్నారు. అయితే నరసింహారావు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను ఫార్వార్డ్ చేశాడు. ఈ సోషల్ మీడియా పోస్ట్‌పై గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళగిరి అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో కేసు నమోదు చేసి రామచంద్రాపురంలో నరసింహారావును అరెస్ట్ చేశారు. అతడ్ని మంగళగిరి తీసుకెళ్లారు.. తాను పోస్టు పెట్టలేదని, ఫార్వర్డ్‌ మాత్రమే చేశానని చెప్పినా వినలేదని నరసింహారావు అంటున్నారట. వృద్ధుడు హృద్రోగ సమస్యలతో ఆయన బాధపడుతున్నారని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోస్టుల్ని ఫార్వార్డ్ చేసిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ సన్నిహితుడు నలంద కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. అలాగే కృష్ణా జిల్లాలో మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని కర్నూలుకు తరలించి ప్రశ్నించారు.. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పోస్ట్.. వృద్ధుడి అరెస్ట్సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే,పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది పోస్టుల్ని షేర్ చిక్కుల్లో పడుతున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3eDNTnv

Comments