తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్ల పరుగు!

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు కూడా దేశీ ఇంధన ధరలు పైకి కదిలాయి. దీంతో హైదరాబాద్‌‌లో శనివారం లీటరు 26 పైసలు పెరుగుదలతో రూ.83.44కు, 21 పైసలు పెరుగుదలతో రూ.78.57కు చేరాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 24 పైసలు పెరిగింది. దీంతో ధర రూ.83.77కు చేరింది. డీజిల్‌ ధర కూడా 19 పైసలు పెరుగుదలతో రూ.78.86కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.83.38కు చేరింది. డీజిల్ ధర కూడా 20 పైసలు పెరుగుదలతో రూ.78.50కు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.80.38కు చేరింది. డీజిల్ ధర కూడా 21 పైసలు పెరుగుదలతో రూ.80.40కు ఎగసింది. ఇక్కడ పెట్రోల్ కన్నా డీజిల్ ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 23 పైసలు పెరుగుదలతో రూ.87.14కు చేరింది. డీజిల్ ధర కూడా 20 పైసలు పెరుగుదలతో రూ.78.71కు ఎగసింది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.78 శాతం తగ్గుదలతో 40.73 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.34 శాతం క్షీణతతో 38.20 డాలర్లకు తగ్గింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3eyiT8l

Comments