ఏపీలో రైతులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించనుంది. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 13 జిల్లాల్లోని 5,94,005 మంది రైతుల ఖాతాలకు రూ.596.36 కోట్లు నేరుగా డబ్బు జమ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో 2018 రబీ పంటల బీమా కింద ప్రభుత్వం బీమా కంపెనీలకు ప్రీమియంను చెల్లించలేదు. దీంతో రైతులకు చెందాల్సిన 596.36 కోట్ల రూపాయలను బీమా కంపెనీలు ఆపేశాయి. అప్పటి నుంచి రైతులకు బీమా డబ్బు అందలేదు. టీడీపీ ప్రభుత్వం 2018 రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించకుండా ఎగనామం పెట్టిందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని సమీక్షల ద్వారా తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్.. వెంటనే కంపెనీలకు బీమా ప్రీమియంను చెల్లించాల్సిందిగా ఆదేశించారు. అయితే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. గత సర్కారు ఎగనామం పెట్టిన పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించాలని నిర్ణయించామంటున్నారు. దీంతో ఇప్పుడు ఏకంగా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/382ywlW
Comments
Post a Comment