నేత, మాజీ ఎమ్మెల్యే మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ వ్యక్తిని ఫోన్‌లో బెదిరించినట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేగుతోంది. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని టీడీపీ మండల కార్యాలయానికి సంబంధించిన అంశంలో తనను మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బెదిరించినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఫిర్యాదు చేసిన వ్యక్తి మోహనరావు గతంలో టీడీపీలో ఉండగా.. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు మండల పార్టీ భవనానికి పసుపు రంగు వేశారు. వైఎస్ఆర్‌సీపీలో చేరిన తరువాత ఈ పార్టీ రంగు వేసే ప్రయత్నం చేశారు. ఆ బిల్డింగ్ తనదేనని, అందుకే వైఎస్‌ఆర్‌సీపీ రంగులు వేశానని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. ‘బిల్డింగ్‌కు రంగు ఎందుకు వేయించావు. నేను ఖాళీ చేయను. అద్దె చెల్లించను. నువ్వు మర్యాద తప్పి ప్రవర్తిస్తే.. నేనూ మర్యాద తప్పుతాను’ అని కూన అన్నారు. దీంతో ఫోన్‌లో తనను కూన బెదిరించినట్లు, తనకు ప్రాణహాని ఉందని శుక్రవారం రాత్రి ఎస్పీ అమిత్ బర్దార్ దృష్టికి మోహన్‌రావు తీసుకువెళ్లారు. శనివారం ఇదే అంశంపై తమకు ఫిర్యాదు అందిందని పొందూరు ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. కాగా, ఈ వివాదంపై కూన రవికుమార్ స్పందించారు. తనను బ్లాక్ మెయిల్ చేయడానికే కుట్ర పన్నారని అన్నారు. ‘బ్లాక్ మెయిల్ చేసేందుకే నా మాటలు రికార్డు చేశారు. ఆ భవనం 2012లో ఇద్దరం కలిసి కొనుగోలు చేశామం.. అయితే ఆ సమయంలో నేను లేకపోవడంతో మోహనరావు పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. నేను ఆయన పట్ల అసభ్యకరంగా మాట్లాడలేదు. బెదిరించనూ’ లేదు అని వివరించారు.గతంలోనూ అధికారులుపై దురుసుగా వ్యవహరించారని కూన రవిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3i6rOQt
Comments
Post a Comment