భారత్‌లో వెయ్యి కరోనా కేసులు నమోదయ్యే వరకూ కూడా పాకిస్థాన్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. దాంతో.. అప్పట్లో పాక్ అభిమానులు భారత్‌పై సెటైర్లు పేల్చగా.. పాక్‌లో అస్సలు కరోనా నిర్ధారణ ల్యాబ్‌లు ఉన్నాయా..? అంటూ భారత అభిమానులు చురకలేశారు. తాజాగా మరోసారి పాకిస్థాన్‌లో టెస్టింగ్ ల్యాబ్స్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన పాకిస్థాన్ క్రికెటర్లకి ఈ వారం ఆరంభంలో కరోనా వైరస్ టెస్టుల్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహించగా.. 10 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో.. వారందర్నీ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిందిగా పీసీబీ ఆదేశించింది. కానీ.. ఈ పరీక్షలపై అనుమానం వ్యక్తం చేసిన సీనియర్ ఆల్‌రౌండర్ .. పర్సనల్‌గా ఓ ల్యాబ్‌లో టెస్టు చేయించుకోగా.. నెగటివ్ వచ్చింది. అదే విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించాడు. దాంతో.. టెస్టు ఫలితాన్ని ఫస్ట్ పీసీబీకి చెప్పి ఉండాల్సిందని హెచ్చరించిన సీఈవో వసీమ్ ఖాన్.. హఫీజ్ క్రమశిక్షణ తప్పడంటూ మండిపడ్డాడు. రోజు వ్యవధిలోనే హఫీజ్‌కి నెగటివ్ రావడంతో మిగిలిన 9 మందికి కూడా ఆ కరోనా టెస్టులపై అనుమానాలు వ్యక్తమవడంతో.. పీసీబీ మరోసారి మహ్మద్ హఫీజ్‌కి టెస్టు నిర్వహించింది. ఈ టెస్టులో మళ్లీ పాజిటివ్ రావడంతో ఇప్పుడు హఫీజ్‌పై పీసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కరోనా నెగటివ్ రావడంతో సెల్ఫ్ క్వారంటైన్‌లో హఫీజ్ ఉండలేదు. దాంతో.. అతను పీసీబీ ఆదేశాల్ని ధిక్కరించినట్లుగా తేల్చారు. ‘‘పాకిస్థాన్ క్రికెట్ తికమకకి పెట్టిందిపేరు.. కానీ ఇప్పుడు కరోనా టెస్టుల రూపంలో దాన్ని మరో స్థాయికి తీసుళ్లారు. 72 గంటల్లోనే హఫీజ్‌కి పాజిటివ్, నెగటివ్, పాజిటివ్’’ అంటూ భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెటైర్ పేల్చాడు. ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు త్వరలోనే పాకిస్థాన్ జట్టు అక్కడికి వెళ్లనుంది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2NB6oNv
Comments
Post a Comment