హైదరాబాద్, తెలంగాణతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. పాస్ కోసం స్పందన వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి వచ్చేవాళ్లకు పాస్ ఉండాలని.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని డీజీపీ అన్నారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్‌పోస్టుల దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తారన్నారు. పాస్‌లు ఉన్నవారికి రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించడం లేదు అన్నారు. రాత్రి వేళల్లో కేవలం అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని.. ప్రజలు ఈ నిబంధనల గురించి తెలుసుకుని సహకరించాలని డీజీపీ కోరుతున్నారు. ప్రజలు ఈ మార్పులను గమనించాలంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలతో హైదరాబాద్‌తో పాటూ తెలంగాణ జిల్లాల నుంచి ఏపీకి జనాలు క్యూ కట్టారు. వేలాదిమంది సొంత రాష్ట్రానికి బయల్దేరారు.. దీంతో ఏపీ సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరినీ అనుమతించకపోవడంతో వాహనదారులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులుపడుతున్నారు. అందుకే పోలీసులు సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దంటున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/38ktSQn
Comments
Post a Comment