ఏపీ రైతులకు శుభవార్త.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

జగన్ సర్కార్ పొగాకు రైతులకు శుభవార్త చెప్పింది.. సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం నుంచి రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అన్నారు. ఇప్పటి నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లను ప్రభుత్వమే చేపడతుంది అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని 1, 2 కేంద్రాల ద్వారా బుధవారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. తర్వాత అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు చేపడుతామని.. ఎఫ్‌3, ఎఫ్‌4, ఎఫ్‌5, ఎఫ్‌8, ఎఫ్‌9 గ్రేడు పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. పొగాకు బోర్డు చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తానికి కొనుగోళ్లు చేస్తామన్నారు మంత్రి. కొద్దిరోజులుగా పొగాకుకు సరైన ధర లేక అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు.. ప్రభుత్వ నిర్ణయంతో పొగాకు రైతులకు ఊరట లభించిందనే చెప్పాలి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2VtqCgv

Comments