అది జగన్ సంస్కారం.. జనసేన ఎమ్మెల్యే రాపాక భావోద్వేగం!

రాపాక వరప్రసాద్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా ప్రజల్లో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్ నంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి జగన్ విశేషంగా కృషి చేస్తున్నారని.. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా, సుభిక్షంగా ఉన్నారన్నారు. అయితే రాపాక మరోసారి జగన్ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారట. జగన్‌- పవన్‌కి చాలా తేడా ఉందన్నారట. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా బుధవారం కాపు నేస్తం నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడివారితో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం అందర్నీ పలకరించారు.. ఈ క్రమంలో జగన్ రాపాక అన్న బావున్నారా అంటూ పలకరించారు. తర్వాత మిగిలిన వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఉన్నా జగన్ తనను ‘అన్న’ అని పిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాపాక వ్యాఖ్యానించారట. పవన్ ఇప్పటి వరకు తనను అంత ప్రేమతో, ఆప్యాయతతో పిలవలేదని తన అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో చెప్పి రాపాక భావోద్వేగానికి గురయ్యారట. అంత ప్రేమగా పిలిచే ముఖ్యమంత్రులు కూడా దేశంలో ఉండరని రాపాక చెప్పుకొచ్చారట. అంతేకాదు గతంలో కూడా తనను ప్రసాద్ అన్న అని పిలిచారని గుర్తు చేసుకున్నారట. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2Bb9iG6

Comments