సోషల్ డిస్టెన్స్ మధ్య ఆర్చర్లు దీపిక, అతాను పెళ్లి.. హాజరైన సీఎం

భారత్‌లో కరోనా వైరస్ పతాక స్థాయిలో వ్యాప్తిస్తున్న వేళ ఆర్చర్లు , అతాను దాస్ వివాహం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితమే ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ.. వివాహం మాత్రం 2020 టోక్యో ఒలింపిక్స్ తర్వాత చేసుకోవాలని గతంలో నిర్ణయించుకుంది. అయితే.. కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదాపడటంతో.. మంగళవారం ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ ఇద్దరు ఆర్చర్లు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరై దంపతుల్ని ఆశీర్వదించారు. వాస్తవానికి తాము పెళ్లి చేసుకోబుతున్నాము అని గత వారం దీపిక కుమారి ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కరోనా వేళ సాహసోపేతంగా వివాహం అవసరమా..? అని పెదవి విరిచారు. కానీ.. భౌతిక దూరం పాటిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకి లోబడి మా వివాహం జరుగుతుందని స్పష్టం చేసిన దీపిక.. ఆ మేరకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఆమె చెప్పిన ప్రకారమే.. పరిమిత సంఖ్యలో అతిథుల్ని పిలవడమే కాకుండా.. వారికి మాస్కులు, శానిటైజర్లని కూడా వివాహ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఈ జంట.. రెండు దఫాలుగా అతిథుల్నిఅక్కడికి వచ్చేలా షెడ్యూల్ చేసింది. రాంచీలోని విశాలమైన కళ్యాణ మండపంలో ఈ వివాహం జరగగా.. తొలుత సాయంత్రం 5.30 గంటలకి 50 మంది అతిథులు వచ్చి దంపతుల్ని ఆశీర్వదించగా.. 7 గంటల తర్వాత మరో 50 మంది వచ్చారు. ఈ రెండో షెడ్యూల్‌లోనే ఝార్ఖండ్ సీఎం వచ్చి నవదంపతుల్ని ఆశీర్వదించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఈ వివాహానికి మీడియా, తోటి ఆర్చర్లకి ఆహ్వానం అందలేదు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2Vwgqny

Comments