గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు ఎంత తగ్గిందంటే?

పసిడి వెలవెలబోయింది. మరోసారి దిగొచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే.. మాత్రం పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధర పడిపోవడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో శనివారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,700కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గింది. రూ.160 తగ్గుదలతో రూ.47,900కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. రూ.47,700కు చేరింది. Also Read: హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 పైకి కదిలింది. దీంతో ధర రూ.46,180కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.20 పెరుగుదలతో రూ.50,390కు ఎగసింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,700కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.80 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1784 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.31 శాతం పెరుగుదలతో 17.95 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2BfFmZh

Comments