ఏపీలో కరోనా మహమ్మారి వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత రెండు మూడురోజులుగా 400కుపైగా కేసులు నమోదయ్యాయి. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇటీవల వరుసగా జరిగిన ఘటనలు కలకలంరేపాయి. ప్రజా ప్రతినిధుల్ని ఈ వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్‌కోట ఎమ్మెల్యేకు పాజిటివ్ నిర్థారణ కాగా.. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మనవడికి కరోనా పాజిటివ్ తేలిందట. Read Also: Must Read: తాజాగా కర్నూలు జిల్లాలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అంతేకాదు తన గన్‌మెన్‌ను క్వారంటైన్‌లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అంతేకాదు ఆయనకు సన్నిహితంగా ఉన్నవాళ్లు క్వారంటైన్‌కు వెళ్లారు.. కరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అమరావతికి వెళ్లడంతో తోటి ఎమ్మెల్యేల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో కూడా ఓ వైసీపీ నేత కరోనా బారిన పడిన్టలు తెలుస్తోంది.. ఆయన మంత్రికి దగ్గరి బంధువుగా తెలుస్తోంది. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3dwJZLH
Comments
Post a Comment