నేటి నుంచి టీడీపీ 'మహానాడు'.. దేశ చరిత్రలోనే తొలిసారి

పసుపు పండుగ మహానాడుకు సిద్ధమైంది టీడీపీ. బుధ, గురువారాల్లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.. బుధవారం ఉదయం10.30 నిమిషాలకు ఆఫీస్‌లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తల్ని ఉద్దేశంిచి ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనలు ఉండటంతో ఆన్‌లైన్‌లో జూమ్ యాప్ ద్వారా మహానాడును నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మహానాడులో 14 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. 14 తీర్మానాలు ఆమోదించనున్నారు. మహానాడులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఏడాది పాలన, వైఫల్యాలు, అమరావతి రాజధాని, పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై చర్చిస్తారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, నేతలపై అక్రమ కేసులు, రైతు రుణమాఫీ వ్యవసాయ సంక్షోభం అంశాలపైనా చర్చ జరగనుంది. ఒక రాజకీయ పార్టీ... ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో వంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి అంటోంది టీడీపీ. ప్రతి ఏటా మూడు రోజుల పాటూ ఎన్టీఆర్ జయంతి కలిసి వచ్చేలా మహానాడును నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం రెండు రోజుల పాటూ నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటూ పార్టీ ముఖ్య నేతలు పార్టీ ఆఫీస్‌లో.. మిగిలిన పార్టీ నేతలు, కార్యకర్తలు వారి ఇళ్ల నుంచే మహానాడులో పాల్గొంటున్నారు. మొదటి రోజు పలు తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. పార్టీ ఆఫీస్‌లో భౌతిక దూరం పాటిస్తూ సీట్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో మృతి చెందినవారికి సంతాపం ప్రకటిస్తారు. తర్వాత రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ప్రసంగం ఉంటుంది. 12 గంటల నుంచి 12.25 వరకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. 12.25 నుంచి ఒంటి గంట వరకు తీర్మానాలు ప్రవేశపెడతారు. భోజన విరామం తర్వాత మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. గురువారం రెండోరోజు ఎన్టీఆర్‌ జయంతి వేడుకలతో మొదలవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 వరకు వివిధ తీర్మానాలు ప్రవేశపెడతారు. భోజన విరామం తర్వాత మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. రాజకీయ, సంస్థాగత తీర్మానాలతో పాటు, ఇతర తీర్మానాలు ప్రవేశపెడతారు. సాయంత్రం 5.05 నుంచి 5.30 వరకు చంద్రబాబు ఉపన్యాసంతో కార్యక్రమం ముగుస్తుంది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3dhwMa8

Comments