ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రమేశ్‌కుమార్ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా, ఈ అంశంపై మంత్రి మరోసారి నోరు జారారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఓ ద్రోహి అంటూ నాని దుయ్యబట్టారు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకున్నా మమ్మల్ని ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆటుపోట్లు కొత్తకాదు. ఆయన 16 నెలలు జైలు జీవితం గడిపారు. పేదల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే.. అమలు చేయడానికి ఎన్ని అడ్డంకులు, కోర్టు తీర్పులొచ్చినా లెక్కచేయరు’ అని పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబు వెబ్‌సైట్ నుంచి రమేశ్ కుమార్ ఆయన యంత్రాంగం ద్వారా లేఖలు పెట్టారని.. వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. తమ చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా పీకలేరన్నారు. ఏపీ ఎస్ఈసీగా రమేష్ కుమార్ టీడీపీ కనుసన్నల్లో వ్యవస్థల్ని నడిపారనీ... ఆ విషయాన్ని హైకోర్టు లెక్కలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. అయినా ప్రభుత్వం ప్రజల కోసం అనుకున్న పని చేసి తీరుతుందని నాని సంకేతాలు ఇచ్చారు. అయితే, ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎస్‌ఈసీ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించగా.. రమేశ్ కుమార్ తిరిగి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టడంపై ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మీడియా సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన కొద్ది సేపటికే ఆయన నియామకం చెల్లదని ఎస్‌ఈసీ కార్యదర్శి ఉత్తర్వులు వెలువరించారు. ఇక, చరిత్రలో తొలిసారిగా అడ్వొకేట్ జనరల్ హోదాలో శనివారం రాత్రి ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిందని, దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా ప్రకటించుకున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి.. హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారని కోరారని వెల్లడించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2zJyMJO
Comments
Post a Comment