ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీకే రమామణి కన్నుమూశారు. గురువారం ఉన్నట్టుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు.. ఛాతీలో నొప్పిగా ఉందనడంతో వెంటనే గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా తుది శ్వాస విడిచారు. రమామణి వాణిజ్య పన్నుల శాఖలో కార్యదర్శిగా పని చేశారు. అనంతపురం జాయింట్ కలెక్టరుగా పని చేసి విజయవాడకు బదిలీ అయ్యారు. గుంటూరు పండరి పురంలో ఆమె బంధువుల ఇంటికి గత రాత్రి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రమామణికి సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గుంటూరు జిల్లా జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ప్రశాంతి, ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ లు శ్రీకాంత్, తాత మోహన్ రావు, డీయస్ఓ టి.శివరామకృష్ణలు నివాళులు అర్పించారు. రమామణి తండ్రి టీకేఆర్ శర్మ స్వాతంత్ర్య సమరయోధులు. శాసనసభ్యులుగా వ్యవహరించారు. ఆమె కర్నూలు జిల్లా నంద్యాలలో జన్మించారు. రమామణి భర్త మురళీమోహన్ ఏపీ స్టెప్‌లో మేనేజరుగా పనిచేసి రిటైర్ అయ్యారు. వారి ఇద్దరు కుమారులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. రమామణి కర్నూలు జిల్లా నంద్యాలలో 1964 అక్టోబర్ 18న రమామణి జన్మించారు. ఆమె హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ పని చేస్తుండగానే, గ్రూప్-1కు ఎంపికై, డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా సర్వీసులోకి వచ్చారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణలో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయిలోనే భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2ZHY59U
Comments
Post a Comment