రాజకీయాల్లోకి షాహిద్ అఫ్రిది..? క్లారిటీ ఇచ్చేసిన పాక్ క్రికెటర్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రాజకీయాల్లో జాయిన్ కాబోతున్నాడా..? అంటే గత రెండు వారాలుగా అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపించాయి. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించిన అఫ్రిది.. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ‘‘ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోంది. కానీ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మనసులో కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది. పాక్ సైన్యం ఏడు లక్షలుకాగా.. ఒక్క కాశ్మీర్‌లోనే భారత ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మంది సైన్యాన్ని మొహరించింది. కానీ.. కాశ్మీర్ పౌరులు పాక్‌ సైన్యానికే సపోర్ట్ చేస్తున్నారు’’ అని విద్వేష వ్యాఖ్యలు చేశాడు. Read More: పాకిస్థాన్‌లో తన పాపులారిటీని పెంచుకునేందుకే అఫ్రిది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడిన భారత మాజీ క్రికెటర్లు.. బహుశా అతను రాజకీయాల్లోకి వెళ్లాలని ఆశిస్తున్నాడేమో..? అని జోస్యం చెప్పారు. అయితే.. తనకి రాజకీయాల్లో వెళ్లే ఆలోచన లేదని తాజాగా అఫ్రిది స్పష్టం చేశాడు. Read More: ‘‘నేను ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాడ్ని. చాలా రాజకీయ పార్టీల నుంచి నాకు గతంలోనే ఆహ్వానాలు అందాయి. అయితే.. ఇప్పటికే నేను పొలిటీషియన్ చేసే సేవా కార్యక్రమాలను చేస్తున్నాను. దానికి అన్ని పార్టీల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. కానీ.. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన మాత్రం నాకు లేదు. ప్రస్తుతం పీఎం ఇమ్రాన్ ఖాన్ సిన్సియర్‌గా పనిచేస్తున్నాడు. మేమందరం అతనికి మద్దతు నిలుస్తాం’’ అని అఫ్రిది వెల్లడించాడు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gAw36i

Comments