దేశ్యాప్తంగా లాక్‌డౌన్ 5.O మొదలైంది.. ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. కేంద్రం కూడా మార్గదర్శకాలు జారీ చేయగా.. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలతో పాటూ కొన్ని నిబంధనలు విధించింది. ఇటు ఏపీకి వెళ్లాలనకునేవారికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చేవారికి సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల దగ్గర తప్పకుండా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని.. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి, అందరూ అందుకు సహకరించాలని కోరారు పోలీసులు. ప్రభుత్వం నుంచి అంతర్ రాష్ట్ర కదిలకలపై నిర్ణయం తీసుకునే వరకు ఈ షరతలు కొనసాగుతాయంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు కచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఏడు రోజులు Institional Qurantineలో ఉండి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఆంక్షలు కొనసాగుతాయి. ప్రయాణికులు గమనించాలని పోలీసులు ట్వీట్ చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. వ్యక్తులు, గూడ్స్ క్యారియర్లకు ఎలాంటి పర్మిషన్లు, పాస్‌లు లేకుండానే అనుమతిస్తారు. ఏపీకి సొంత వాహనాల్లో వెళ్లినా.. వారికి చెక్ పోస్టుల వద్ద కరోనా పరీక్షలు జరిపిన తర్వాతే అనుమతిస్తారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3cl2Mcn
Comments
Post a Comment