ఏపీ హైకోర్టులో డాక్టర్ సుధాకర్ సంచలన పిటిషన్

విశాఖ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడం లేదని.. మరో ఆస్పత్రికి తరలించాలని కోరారు. అంతేకాదు కోర్టు పర్యవేక్షణలో తనకు వైద్యం అందించాలని కోరారు. తనకు అందిస్తున్న ట్యాబ్లెట్ల వివరాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయని ప్రస్తావించారు. ఈ పిటిషన్ ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. డాక్టర్ సుధాకర్ విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సుధాకర్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని.. తనకు ఎలాంటి మానసిక సమస్య లేదన్నారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో ప్రస్తావించారు. ఈ మందుల ఉపయోగించడం వల్ల తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్నారు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యల్ని ఎదుర్కుంటున్నానని ఓ ఫోటోను కూడా జతపరిచారు. ముఖ్యంగా తనకు స్కిజోఫీనియా వంటి సమస్యలతో బాధపడే రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఇస్తున్న మందులతో రియాక్షన్స్‌ వస్తున్నాయని.. ఆ మందులతో పెదాలు పొడిబారాయని.. మందుల ప్రభావంతో యూరిన్‌ ఆగి.. కళ్లు మసకబారాయని.. తల తిరుగుతోందని చెప్పుకొచ్చారు. తనను వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని లేఖలో కోరారు. ఈ నెల 16న డాక్టర్ సుధాకర్‌ను విశాఖలో పోలీసులు అరెస్ట్ చేసి కేజీహెచ్‌కు తరలించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని మానసిక ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా.. మెజిస్ట్రేట్‌తో సుధాకర్ స్టేట్మెంట్‌ను రికార్డ్ చేయించారు. తర్వాత హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేసి.. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ సుధాకర్ విధులు నిర్వహిస్తున్నారు.. మాస్కులు, కిట్లు లేవంటూ ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. తర్వాత ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2yIgJTT

Comments