ఏపీలో నడిచే రైళ్ల వివరాలు ఇవే.. ఎక్కడెక్కడ ఆగుతాయంటే!

నేటి నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లను పునఃప్రారంభిస్తుండటంతో రైల్వే శాఖ ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారు. ముంబై, భువనేశ్వర్, చెన్పై, బెంగళూరు, ఢిల్లీకి ఈ రైళ్లు నడవనున్నాయి. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులు గంటన్నర ముందుగానే స్టేషన్‌ రావాలని రైల్వే శాఖ సూచించింది. ప్రతీ ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. ధర్మో స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతించనున్నారు. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు గమ్యస్థానం చేరాక అక్కడి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. అనారోగ్య లక్షణాలుంటే ప్రయాణానికి అనుమతించరు. తక్కువలగేజీతో రావాలని రైల్వేశాఖ సూచిస్తోంది. రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. ఇక ఏపీ మీదుగా నడిచే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train Number-02728 హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (డైలీ) విజయవాడ, రాజమండ్రి (ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-027289 విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (డైలీ) రాజమండ్రి, విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-07201 గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (డైలీ) విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-07202 సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (డైలీ) విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02793 తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (డైలీ) కడప, గుంతకల్లు (ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-02794 నిజామాబాద్-తిరుపతిరాయలసీమ ఎక్స్‌ప్రెస్ (డైలీ) గుంతకల్లు, కడప(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-02805 విశాఖపట్న-న్యూ ఢిల్లీ (డైలీ) రాజమండ్రి, విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-02806 న్యూ ఢిల్లీ-విశాఖపట్నం (డైలీ) విజయవాడ, రాజమండ్రి(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-01019 ముంబై-భువనేశ్వర్ (కోణార్క్ ఎక్స్‌ప్రెస్) విజయవాడ, విశాఖపట్నం(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-01020 భువనేశ్వర్-ముంబై (కోణార్క్ ఎక్స్‌ప్రెస్) విశాఖపట్నం, విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-01301 ముంబై-బెంగళూరు (ఉదయన్ ఎక్స్‌ప్రెస్) గుంతకల్, అనంతపురం(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-01302 బెంగళూరు-ముంబై (ఉదయన్ ఎక్స్‌ప్రెస్)
Train Number-02296 ధన్‌పూర్-బెంగళూరు (సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్) విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02297 బెంగళూరు-ధన్‌పూర్ (సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్) విజయవాడ(ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02703 హౌరా-సికింద్రాబాద్ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్) విశాఖ, విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-02704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్) విజయవాడ, విశాఖ(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-02245 హౌరా-యశ్వంత్‌పూర్ (దురంతో ఎక్స్‌ప్రెస్) విజయవాడ, రేణిగుంట(ప్రభుత్వం సూచించిన స్టాప్స్)
Train Number-02246 యశ్వంత్‌పూర్-హౌరా (దురంతో ఎక్స్‌ప్రెస్) రేణిగుంట (ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02692 న్యూ ఢిల్లీ-బెంగళూరు సిటీ అనంతపురం (ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02691 బెంగళూరు సిటీ అనంతపురం (ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02434 న్యూఢిల్లీ-చెన్నై విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)
Train Number-02435 చెన్నై-న్యూఢిల్లీ విజయవాడ (ప్రభుత్వం సూచించిన స్టాప్)


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3gClFuG

Comments