భారత మాజీ బాక్సర్ డింకో సింగ్‌కి కరోనా వైరస్ సోకింది. గత కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న డింకో సింగ్‌ని రేడియేషన్ థెరపీ కోసం ఇటీవల ఇంఫాల్ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ అతనికి సేవలు అందించిన నర్స్‌కి కరోనా వైరస్ పాజిటివ్‌రాగా.. తాజాగా డింకో సింగ్‌కీ కూడా ఆ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. 1988 ఆసియా క్రీడల్లో డింకో గోల్డ్ మెడల్ సాధించాడు. వాస్తవానికి ఢిల్లీ నుంచి మణిపూర్‌కి బయల్దేరే సమయంలో నిర్వహించిన పరీక్షల్లో డింకోకి కరోనా నెగటివ్ వచ్చింది. కానీ.. మణిపూర్‌కి వెళ్లాక పాజిటివ్‌గా రావడంతో అతని కష్టాలు రెట్టింపయ్యాయి. క్యాన్సర్‌తో బాధపడుతున్న డింకో.. లాక్‌డౌన్ కారణంగా కొన్ని రోజులు రేడియేషన్ థెరపీకి దూరమయ్యాడు. దాంతో.. అతనికి సాయం చేయాల్సిందిగా భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుని కోరింది. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కిరణ్ రిజిజు స్వయంగా మణిపూర్ ప్రభుత్వాన్ని ప్రయాణ ఏర్పాట్లు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. దాంతో.. థెరపీ కోసం డింకోని ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు. కానీ.. అక్కడ నర్సుకి కరోనా వైరస్ సోకవడంతో.. డింకో కూడా ఆ వైరస్ బారినపడ్డాడు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2AurRnL
Comments
Post a Comment