జడ్జిలను కించపరిచేలా అభ్యంతకరకరంగా, అసభ్యకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ కొరడా ఝుళిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్టార్ జనరల్ బి.రాజశేఖర్ ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసులు ఫైల్ చేశారు. సీఐడీ ఎదుట విచారణకు రావాలని నిందితుల్లో కొంతమందికి సీఆర్‌పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ అయ్యాయి. ఆ ఏడుగురు కాకుండా మిగిలిన వారిపైనా విచారణ సాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పులపై కొంతమంది సోషల్ మీడియాలో అభ్యంతకరంగా పోస్టులు పెట్టారు. ఈ అంశంపై లాయర్ లక్ష్మీనారాయణ హైకోర్టుకు ఫిర్యాదు చేయగా.. సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 49మందిని గుర్తించి వారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. వీరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటూ మరికొందరు ఉన్నారు. వారిలో ఏడుగురిపై కేసులు నమోదు చేసింది.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2TKxq8p
Comments
Post a Comment