పసిడి ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త. మళ్లీ తగ్గింది. దీంతో పసిడి వరుసగా రెండు రోజులుగా తగ్గుతూనే వస్తున్నట్లు అయ్యింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే.. కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.920 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,310కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గుదలతో రూ.48,090కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ.800 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.47,900కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.14 శాతం దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్‌కు 1708.30 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం పెరుగుదలతో 17.80 డాలర్లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.46,000 వద్దనే ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతోంది. దీంతో ధర రూ.47,810 వద్ద స్థిరంగా ఉంది. ఇక కేజీ వెండి ధర పడిపోయింది. రూ.800 తగ్గుదలతో రూ.47,900కు పతనమైంది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3d4P5zr
Comments
Post a Comment