దేశీ ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. నిలకడగానే ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో సోమవారం లీటరు రూ.73.97 వద్ద, రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.74.21 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.68.15 వద్దనే నిలకడగా ఉంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.69.59 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.62.29 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.75.30 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.21 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 3.65 శాతం తగ్గుదలతో 25.65 డాలర్లకు దిగొచ్చింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 7.08 శాతం తగ్గుదలతో 18.38 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2WlUWZX
Comments
Post a Comment