ధోనీ ఇంకా ఏం సాధించాలి..? రీఎంట్రీ అవసరం లేదు: మాజీ కీపర్

భారత మాజీ కెప్టెన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా టీమిండియా తరఫున మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేలా కనిపించాడు. కానీ.. సెమీ ఫైనల్లో భారత్ జట్టు ఓడిపోవడం.. దానికి ధోనీ రనౌటే కారణం కావడంతో వీడ్కోలు నిర్ణయంపై మౌనంగా ఉండిపోయాడు. అయితే.. గత 10 నెలల్లో లెక్కకి మించి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు, వార్తలు వినిపించాయి. కానీ.. ధోనీ మాత్రం పెదవి విప్పలేదు. Read More: రెండు రోజుల క్రితం అనూహ్యంగా #DhoniRetires కీవర్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. దాంతో.. అది ఒట్టి రూమరేనని కొట్టిపారేసిన అతని భార్య సాక్షి.. కాస్త ఘాటుగానే చురకలు కూడా వేసింది. మొత్తంగా.. ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకిరాగా.. కెరీర్‌లో ఇప్పటికే అన్ని ఘనతలు సాధించిన ధోనీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని కీర్మాణీ చెప్పుకొచ్చాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా భారత్‌ని విజేతగా నిలిపిన ధోనీ.. క్రికెట్ చరిత్రలో ఓ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. Read More: ‘‘ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. కాబట్టే ఇప్పుడు అతను తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. నా అంచనా ప్రకారం అతను మళ్లీ టీమిండియాకి ఆడతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అతను తన లక్ష్యాల్ని, కలల్ని సాకారం చేసుకున్నాడు. ఇక అతను సాధించాల్సి ఏముంది..? మీడియాలో కథనాల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే..? ఐపీఎల్‌‌లో ఆడేందుకు ధోనీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. బహుశా ఐపీఎల్ 2020 సీజన్ అతనికి ఆఖరిది కావొచ్చు’’ అని కీర్మాణీ జోస్యం చెప్పాడు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3euYEIe

Comments