పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. బంగారం వెలవెలబోతోంది. పసిడి ధర తగ్గుతూనే వస్తోంది. పసిడి ధర గత రెండు రోజులుగా పడిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినా కూడా మన దేశంలో తగ్గడం గమనార్హం. మరోవైపు బంగారం ధర దిగొస్తే కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో గత రెండు రోజుల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1010 తగ్గుదలతో రూ.43,410కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.990 క్షీణతతో 10 గ్రాములకు రూ.46,200కు దిగొచ్చింది. Also Read: పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అయితే వెండి మాత్రం ఒకరోజు పైకి కదిలితే.. మరో రోజు కిందకు దిగింది. మొత్తంగా కేజీ వెండి ధర రెండు రోజుల్లో రూ.510 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.41,000కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. Also Read: ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.95 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1710.25 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.85 శాతం పెరుగుదలతో 15.02 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2WfpA7m
Comments
Post a Comment