లాక్‌డౌన్ టైంలో తినాలని ఉంది కేసీఆర్ తాతా అని ఓ చిన్నారి అడుగుతున్న వీడియో ఆ బాలిక తండ్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన విషయం గుర్తుందా? పానీపురీ అంటే పిల్లలకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సాయంత్రమైతే చాలు రోడ్డు పక్కన ఉన్న పానీపురీ బండి దగ్గర గప్‌చుప్‌లు లాగించేయడానికి పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఆ ఇష్టమే 40 మంది అస్వస్థతకు గురి కావడానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షిద్‌నగర్, సుందరయ్య నగర్‌కు చెందిన చిన్నారులు సోమవారం సాయంత్రం ఓ తోపుడుబండి వద్ద పానీపూరి తిన్నారు. రాత్రి 9 గంటల నుంచి వారికి వాంతులు, విరేచనాలు కావడం మొదలైంది. దీంతో ఒకరి తర్వాత మరొకరు.. మొత్తం 40 మంది రిమ్స్‌లో చేరారు. ఇంత మంది అస్వస్థతతో రిమ్స్‌లో చేరడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీయగా.. వారంతా పానీపురీ తిన్న విషయం వెలుగులోకి వచ్చింది. వారికి ప్రాణాపాయం లేదని.. కోలుకుంటున్నారని రిమ్స్ వైద్యులు ప్రకటించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం పానీపురీ అమ్మకాలకు వెసులుబాటు లేదు. కానీ కొంత మంది ఉపాధి కోసం కాలనీలకు వెళ్లి పానీపురీని విక్రయిస్తున్నారు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/3c4fjkm
Comments
Post a Comment