మెదక్: బోరుబావిలో పడ్డ బాలుడు మృతి.. 25 అడుగుల లోతులో

నోరు తెరిచిన మరో పసివాడిని మింగేసింది. జిల్లాల్లో బోరు బావిలో పడిపోయిన సాయివర్ధన్ కన్నుమూశాడు. 10 గంటల పాటూ సాగిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించలేదు.. 25 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ బిడ్డ ఇక లేడనే చేదు నిజాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. పాపన్న పేట మండలం పొడ్చన్‌పల్లిలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారమిచ్చారు. ఆక్సిజన్‌ పైపు లోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. బోరు బావి 150 అడుగుల లోతు ఉండగా.. చిన్నారి సంజయ్‌ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించా. బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. బాలుడు సురక్షితంగా బయటపడతాడని భావించారు.. కానీ విషాదమే ఎదురైంది. మెదక్ జిల్లాలో తన తాత భిక్షపతి ఇంటికి నాలుగు నెలల క్రితం వచ్చాడు. ఆయన పొలంలోనే మూడు బోర్లు వేశారు.. కానీ నీళ్లు మాత్రం పడలేదు. రెండు బావుల్ని మూతవేశారు కానీ.. మరో బావిని మర్చిపోయారు. ఇంతలోనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.


from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/2XDMEgG

Comments