మేషం ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుంచి బయటపడతారు. సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహన యోగం పొందుతారు. వృషభం బంధువులతో ఏర్పడిన వివాదాలు, మనస్పర్ధలను పరిష్కరించుకొంటారు. అనుకోని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా వ్యవహరించి బయటపడతారు. వివాదాలు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిథునం ముఖ్యమైన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక వ్యవహారాలు, నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహం అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కన్య బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు, విభేదాలను పరిష్కరించుకొంటారు. దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యల నుంచి సన్నిహితుల సాయంతో బయటపడతారు. అన్ని విషయాలలోనూ కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప ధనలాభం పొందుతారు. Read Also: తుల స్థిరాస్తి వ్యవహారాలు, భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు లాభిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వృశ్చికం సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ధనుస్సు వృత్తి, వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలకు, వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మకరం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుంభం నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఓ వార్త కుటుంబంలో ఆనందానికి కారణమవుతుంది. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీనం దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలు, ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2VGsKls
Comments
Post a Comment