పెరుగుతూనే వస్తోంది. ఈ రోజు కూడా పసిడి ధర పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరుగుదల కారణంగా మన దేశంలోనూ పసిడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర పెరిగితే ఇదే దారిలో నడిచింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.45,930కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.42,620కు ఎగసింది. Also Read: పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగింది. దీంతో వెండి ధర రూ.42,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.39 శాతం పైకి కదిలింది. దీంతో ఔన్స్‌కు 1742.90 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.15 శాతం పెరుగుదలతో 15.44 డాలర్లకు ఎగసింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.43,120కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.120 పెరుగుదలతో రూ.46,030కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.70 పెరిగింది. దీంతో ధర రూ.42,600కు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2VYt8uI
Comments
Post a Comment