ఏపీలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇవాళ కొత్త పథకం ప్రారంభం

జగన్ సర్కార్ ఇవాళ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభంకానుంది. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లను పూర్తి ఫీ జు రీయింబర్స్‌మెంట్‌ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. Read Also: జగనన్న విద్యాదీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలని జగన్ సర్కారు గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. త్రైమాసికానికి ఓ విడత చొప్పున రీయింబర్స్‌మెంట్ సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు. ఈ నిర్ణయంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట కలగనుంది. ఇందుకోసం 75 శాతం హాజరు తప్పనిసరి అనే నిబంధన విధించింది. జగనన్న ‘వసతి దీవెన ’పథకం కింద ప్రతి ఐటీఐ విద్యార్థికి ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థికి రూ. 15 వేలు, డిగ్రీ ఆ పై కోర్సుల వారికి రూ. 20 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. Also Read: అంతేకాదు విద్యార్థుల కోసం ఇప్పటికే జగన్ సర్కారు అమ్మ ఒడి పథకం కింద బడికెళ్లే విద్యార్థుల తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేశారు. అలాగే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2VX14HO

Comments