ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1097 కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్క రోజే 81 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఏపీ రాజ్ భవన్‌లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాజ్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. సిబ్బందిలో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో గవర్నర్ సహా 8 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యసిబ్బందిలో ఒకరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఎంపీ కుటుంబానికి సైతం కరోనా సోకిందని తేలింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన కర్నూలు జిల్లాలో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ తేలింది. ఎంపీ తండ్రితో పాటు, ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, ఒకరి కుమారుడు ఉన్నారు. ఎంపీ తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులే కావడంతో ఆందోళన వ్యక్తమవుతోందని పలు మీడియా ఛానల్స్‌లో వార్తలు వచ్చాయి. కుటుంబసభ్యులకు కరోనా సోకిందన్న వార్తలపై స్పందించిన ఎంపీ సంజయ్.. ఆ వార్తలు నిజమేనన్నారు. మరోవైపు కరోనా కోసం పనిచేస్తున్న వారు కూడా ఆ వైరస్‌కు గురవుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఒక పీజీ వైద్యురాలికి పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో పీజీ వైద్యుడిలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో వారిద్దర్నీ ఐసొలేషన్‌కు పంపించారు. రాష్ట్రస్థాయి కొవిడ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌కు కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఆరుగురు పోలీసు సిబ్బందికి, హోంగార్డుకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వాలంటీర్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. అయితే ఈ కేసులను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కరోనా కట్టడిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న జగన్... ప్రజల్లో భయాలు కల్పించకుండా భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆదివారం కేంద్రమంత్రి అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో ఆయన అనేక అంశాల పట్ల చర్చించారు.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3eTf4LG
Comments
Post a Comment