జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్చింది.. ఆ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ జీవో విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసం పేరు మార్చినట్లు జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌కు కూడా అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పేరు ఉండటంతో మరో కారణంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు గతంలో నాగపూర్ మెట్రో ప్రాజెక్ట్ పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసినట్లు జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని చెబుతోంది. గత ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. అమరావతి, విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణం చేపట్టాలని భావించింది. డీపీఆర్‌పై కసరత్తు చేసింది.. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టింది.
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2xeuOaV
Comments
Post a Comment